అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై హోంమంత్రి అనిత హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అమరావతిని ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా పునఃప్రతిష్ఠించేందుకు సీఎం చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందని, ఇది రైతుల త్యాగాలకు, శాంతియుత పోరాటానికి దక్కిన గొప్ప విజయమని ఆమె కొనియాడారు. రాజధానిని వేరెవరూ కదల్చలేనంత కట్టుదిట్టంగా చట్టబద్ధత కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేస్తూ, రైతులకు మరియు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె అభినందనలు తెలిపారు.