విశాఖ జీవీఎంసీ 48వ వార్డు ఇందిరా నగర్-4లో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నివారణకు ప్రజలు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ నిఘా కెమెరాలు నేరాల నియంత్రణకు, యువత గంజాయి వంటి వ్యసనాలకు దూరం కావడానికి దోహదపడతాయని ఆమె తెలిపారు. వార్డు అభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆమె కోరారు.