విశాఖ: ఏయూలో ఘనంగా ‘శతాబ్ది హిందీ సాహిత్య మహోత్సవం’

0చూసినవారు
విశాఖ: ఏయూలో ఘనంగా ‘శతాబ్ది హిందీ సాహిత్య మహోత్సవం’
ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం ఆధ్వర్యంలో గురువారం శతాబ్ది హిందీ సాహిత్య మహోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ, హిందీ భాషా సాహిత్యాల అభివృద్ధికి ఇటువంటి సదస్సులు దోహదపడతాయని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు హిందీ విభాగాధిపతి ఆచార్య నల్ల సత్యనారాయణ, బి. ఓ. ఎస్ చైర్మన్ ఆచార్య జర్రా అప్పారావు బహుమతులు అందజేశారు. వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్