
గూగుల్ లో సరికొత్త ఫీచర్ !
స్మార్ట్ఫోన్ వినియోగదారుల కోసం గూగుల్ 'ట్యాప్-టు-షేర్' అనే కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి రానుంది. One UI తాజా వెర్షన్లలో ఈ ఆప్షన్ కనిపించడం దీని రాకను సూచిస్తోంది. ఈ ఫీచర్ NFC టెక్నాలజీ ద్వారా రెండు పరికరాలను గుర్తించి, బ్లూటూత్ లేదా వై-ఫై డైరెక్ట్ ద్వారా వేగంగా ఫైళ్లను బదిలీ చేస్తుంది. దీనివల్ల ఫైల్ ట్రాన్స్ఫర్ వేగం గణనీయంగా పెరుగుతుంది.




