విశాఖ: బీచ్ షాకులకు మద్దతు వ్యాఖ్యలు ఖండనీయం: ఐద్వా

1165చూసినవారు
విశాఖ: బీచ్ షాకులకు మద్దతు వ్యాఖ్యలు ఖండనీయం: ఐద్వా
బీచ్ షాకులు, మద్యం వినియోగానికి అనుకూలంగా ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలను ఐద్వా జిల్లా కమిటీ ఖండించింది. జిల్లా అధ్యక్షురాలు ఆర్‌. ఎన్‌. మాధవి, కార్యదర్శి వై. సత్యవతి విడుదల చేసిన ప్రకటనలో, బీచ్ షాకుల ఏర్పాటుకు సంబంధించిన జీవో 362ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం వినియోగాన్ని ప్రోత్సహించే వ్యాఖ్యలు సమాజానికి హానికరమని పేర్కొన్నారు. విశాఖను కుటుంబ పర్యాటక నగరంగా అభివృద్ధి చేయాలని, మద్యం విక్రయాల కంటే యువతకు ఉపాధి అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్