ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 సందర్భంగా, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, సహజ వనరుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. హరిత సమాజ నిర్మాణం, పునరుత్పాదక ఇంధన వినియోగం, స్థిరమైన అభివృద్ధి ద్వారా ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని, ఈ పోస్టర్ ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.