విశాఖ‌: గాంధీ మార్గం అనుస‌ర‌ణీయం

6చూసినవారు
విశాఖ‌: గాంధీ మార్గం అనుస‌ర‌ణీయం
విశాఖ‌లోని 40వ వార్డు పరిధిలోని ఏకేసి కాలనీలో శుక్రవారం మహాత్మా గాంధీ 78వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు ముఖ్య నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచానికే శాంతి సందేశాన్ని అందించిన గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన చూపిన మార్గంలో నడవడమే అసలైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్