కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా హోంశాఖ సాధించిన విజయాలు, సంస్కరణలపై హోంమంత్రి వంగలపూడి అనిత ఒక ప్రత్యేక ప్రగతి వీడియోను విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేశామని, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళలు, చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని ఆమె పేర్కొన్నారు. సాంకేతికతను జోడించి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అందుబాటులోకి తెచ్చామని, పోలీస్ శాఖ ఆధునీకీకరణ, సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా హోంశాఖను బలోపేతం చేశామని హోంమంత్రి అనిత ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు.