బుధవారం, భారత క్రికెట్ జట్టు సభ్యులు సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి పలువురు ఆటగాళ్లు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.