విశాఖ‌: వలకు చిక్కుకున్న తాబేళ్లను రక్షించిన భారత నౌకాదళం

3చూసినవారు
విశాఖ సముద్ర తీరంలో భారత నౌకాదళం మానవతా దృక్పథాన్ని చాటుకుంది. తీర భద్రతా గస్తీలో ఉన్న ఐఎన్‌ఎస్ తర్ముగ్లి నౌక సిబ్బంది, సముద్రంలో తేలియాడుతున్న మత్స్య వలల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న రెండు ఆలివ్ రిడ్లే తాబేళ్లను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన నౌకాదళ సిబ్బంది ఆ వలల నుండి తాబేళ్లను అత్యంత చాకచక్యంగా రక్షించి, తిరిగి సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు. సముద్ర జీవుల రక్షణలో నౌకాదళం చూపిన ఈ చొరవను పలువురు అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్