విశాఖ‌: ప్రభుత్వ ఆస్తుల విక్రయ చట్టంపై వామపక్షాల ధర్నాలు

4చూసినవారు
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్మేసేందుకు కూటమి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోందని, దీనికి నిరసనగా పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టనున్నట్లు మాజీ కార్పొరేటర్ బి. గంగారావు తెలిపారు. 'అమ్మకానికి గ్రేటర్' అంటూ ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా విమర్శించిన ఆయన, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం వామపక్షాల ఆధ్వర్యంలో నగరవ్యాప్త నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్