ఓ మహిళ వాట్సాప్ స్టేటస్ ఫోటోలను డౌన్‌లోడ్ చేసి, అవి మార్ఫింగ్ చేసి నగ్నంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పెట్టాడని ఫిర్యాదు చేయడంతో విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. సీపీ శంఖబ్రత బాగ్బీ ఆదేశాల మేరకు నిందితుడిని గుర్తించి, కాకినాడకు చెందిన తాటికాయల దివాకర మారుతి సత్యతేజ్ ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అపరిచితులపై జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు.