విశాఖ నగరంలో ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని సీపీఎం గురువారం మద్దిలపాలెం బస్ కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టింది. 'స్త్రీశక్తి' పథకం కింద ఉచిత ప్రయాణం కల్పించినా, అందుకు తగ్గట్టుగా బస్సులను పెంచకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్. కె. ఎస్. వి. కుమార్ విమర్శించారు. విశాఖలో 1,760 బస్సులు అవసరమున్నా, పాత బస్సులతోనే నెట్టుకొస్తున్నారని, రద్దు చేసిన రూట్లను పునరుద్ధరించి, కొత్త బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో వి. కృష్ణారావు, పి. వెంకటరావు తదితర నాయకులు పాల్గొన్నారు.