విశాఖ: 4 నుంచి 7వరకు ఆర్గానిక్‌ మేళా

8చూసినవారు
విశాఖ: 4 నుంచి 7వరకు ఆర్గానిక్‌ మేళా
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో డిసెంబర్ 4 నుండి 7వ తేదీ వరకు ప్రకృతి వ్యవసాయ రైతుల పంటల మేళా నిర్వహించబడుతుంది. భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి మంగళవారం విలేఖరుల సమావేశంలో రైతులు, ప్రజలు ఈ మేళాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ మేళాను ప్రారంభించనున్నారు. డిసెంబర్ 6న ఎం.ఎస్.ఎం.ఇ. శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా పాల్గొంటారని కుమారస్వామి తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you