విశాఖ: సంక్రాంతి ప్రయాణికులకోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు

2చూసినవారు
విశాఖ: సంక్రాంతి ప్రయాణికులకోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, విశాఖ వాల్తేరు డివిజన్ ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. డీఆర్ఎం లలిత్ బోహ్రా శనివారం విశాఖ రైల్వే స్టేషన్‌లో ఏర్పాట్లను సమీక్షించారు. ప్రయాణీకుల కోసం అదనపు టికెట్ కౌంటర్లు, విచారణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లు, అదనపు కోచ్‌లు నడపడంతో పాటు, 24 గంటల పర్యవేక్షణ కోసం డివిజనల్ కార్యాలయంలో 'వార్ రూమ్' కూడా నెలకొల్పారు. భద్రతను పర్యవేక్షించడానికి ఆర్పీఎఫ్ ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రయాణీకులు ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు చేయవద్దని డీఆర్ఎం సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్