విశాఖలోని జీవీఎంసీ, సులభ్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా 'శిఖర్ సే సాగర్ తక్' స్వచ్ఛతా కార్యక్రమాలను ఫిబ్రవరి 7, 8 తేదీలలో ఆర్కే బీచ్‌లోని కాళీమాత దేవాలయం సమీపంలో నిర్వహించనున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ మంగళవారం తెలిపారు. ఫిబ్రవరి 8న ఉదయం 6 గంటలకు సైక్లోథాన్, అనంతరం బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛ విశాఖకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.