విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బుధవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్‌వేపైనే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గంటల తరబడి విమానాశ్రయంలోనే వేచి చూడాల్సి రావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. లోపాన్ని సరిచేసిన తర్వాత విమానం సురక్షితంగా బయలుదేరింది.