విశాఖ: అనుబంధ కళాశాలల బలోపేతమే ధ్యేయం

3చూసినవారు
విశాఖ: అనుబంధ కళాశాలల బలోపేతమే ధ్యేయం
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో 'సెంటినరీ కనెక్ట్' ప్యానెల్ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి. పి. రాజశేఖర్ మాట్లాడుతూ, అనుబంధ కళాశాలలను విశ్వవిద్యాలయంతో మరింతగా అనుసంధానం చేయడం ద్వారా అకడమిక్ ఎక్సలెన్స్ సాధించడమే లక్ష్యమని తెలిపారు. ఏప్రిల్ 18న అనుబంధ కళాశాలల ప్రతినిధులతోనే శతాబ్ది వేడుకలను ప్రారంభిస్తామని, రిజిస్ట్రేషన్ల పెంపుతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ఏయూ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చా వేదికలో ఉన్నత విద్యా మండలి మాజీ వైస్ చైర్మన్ ఆచార్య కె. రామమోహనరావు, పలువురు వీసీలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :