విశాఖ‌: పేదల సంక్షేమమే లక్ష్యం

2చూసినవారు
విశాఖ‌: పేదల సంక్షేమమే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఎన్టీఆర్ భరోసా' సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు శనివారం పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 59, 60వ వార్డుల్లో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ నగదును స్వయంగా అందజేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకే పెన్షన్ మొత్తాన్ని పెంచినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, వారి ముంగిటకే సేవలను చేరువ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్