విశాఖపట్నంలోని దస్పల్లా హిల్స్ పందిమెట్ట ప్రాంతంలో ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా సిఐటియు, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. అధ్యక్షురాలు కే. మణి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ ముగ్గుల పోటీలు కేవలం సంప్రదాయమే కాకుండా, పెరిగిన ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని మహిళలు తమ ఆకాంక్షలను వ్యక్తం చేసే వేదికగా నిలిచాయని తెలిపారు. ఐద్వా కార్యదర్శి ఆర్. వరలక్ష్మి, సిఐటియు నాయకులు కె. నర్సింగరావు మహిళా చైతన్యం, జాతి సమైక్యతకు ఇటువంటి కార్యక్రమాలు ప్రతీకలని కొనియాడారు.