విశాఖపట్నంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. రామ్ నగర్, పందిమెట్ట, కలెక్టర్ ఆఫీస్ ప్రాంతాల్లో నర్సింగరావు ఆధ్వర్యంలో పతాకావిష్కరణ జరిగింది. సిరిపురం హోటల్ జంక్షన్ వద్ద సిమ్ నాయుడు, జనార్ధన రావు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కె. నర్సింగరావు, వై. రాజు మాట్లాడుతూ, దేశాభివృద్ధికి మూలస్తంభాలైన కార్మికుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, శ్రమ దోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వాల వైఖరిని ఖండించారు. కార్మికులందరూ సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.