విశాఖ‌: మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

5చూసినవారు
విశాఖ‌: మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి
విశాఖపట్నంలో ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన మహిళా రిజర్వేషన్ల సదస్సులో నాయకురాలు ఎస్. పుణ్యవతి మాట్లాడుతూ, కేంద్రం డీలిమిటేషన్, జనగణన సాకుతో మహిళా రిజర్వేషన్ల అమలును వాయిదా వేస్తోందని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఎటువంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, మహిళా సాధికారత కోసం పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఐద్వా నేతలు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్