విశాఖ: విద్యుత్ తీగ తగిలి కార్మికుడు మృతి

5చూసినవారు
విశాఖ: విద్యుత్ తీగ తగిలి కార్మికుడు మృతి
విశాఖపట్నంలోని సాకేతపురంలో అల్యూమినియం పనులు చేస్తుండగా బొల్ల దుర్గారావు (32) అనే కార్మికుడు భవన రెండో అంతస్తులో విద్యుత్ తీగ తగిలి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మధ్యాహ్నం సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ఘటన ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్