విశాఖ: ఏబీఎన్ రాధాకృష్ణపై వైకాపా ఫిర్యాదు

1చూసినవారు
విశాఖ: ఏబీఎన్ రాధాకృష్ణపై వైకాపా ఫిర్యాదు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు, దూషణాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ, వైకాపా విశాఖ జిల్లా అధ్యక్షుడు కె. కె. రాజు ఆధ్వర్యంలో శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న జగన్‌పై ఎల్లో మీడియా విషం కక్కుతోందని, రాధాకృష్ణపై వెంటనే కేసు నమోదు చేయాలని కె. కె. రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్