వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మహిళా నేతలను కించపరిచేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం నగర నేతలు పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఏప్రిల్ 9న ఈ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కె. కె. రాజు మాట్లాడుతూ, మహిళలను అవమానించేలా రాతలు రాసిన రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.