విశాఖపట్నంలోని 46వ వార్డు కైలాసపురంలో
టీడీపీ మహానాడు జరుగుతుండగా, బుధవారం ఉదయం
వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. జీవీఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, మాజీ కో ఆప్షన్ మెంబర్ సేనపతి అప్పరావు, మాజీ కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ కార్యకర్తలతో కలిసి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.