జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనవసర రాజకీయం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమర్శించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, నియమ నిబంధనలు తెలియని వైసీపీ సీనియర్ నేతలు కావాలనే గీతం కళాశాల భూములపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి, సభను తప్పుదోవ పట్టించడం సరికాదని, ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే తాము ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.