వైజాగ్ చేరుకున్న వైఎస్ జగన్

3చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరుకానున్నారు. జగన్ రాకతో విశాఖలోని పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్