రాంబిల్లి మండలం సీతంపాలెం గ్రామంలో శనివారం రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీతో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భేటీ అయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను ఆయనకు ఎమ్మెల్యే వివరించారు. నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా అనిల్ అంబానీకి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దీనిపై అంబానీ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.