
పదేళ్ల కూతురిని వ్యభిచార రొంపిలోకి దింపిన తల్లి.. లక్షల్లో వసూల్
నవీ ముంబైలోని తలోజా ప్రాంతంలో పదేళ్ల చిన్నారిని వ్యభిచార రొంపిలోకి దింపేందుకు ఓ తల్లి ప్రయత్నించింది. 70ఏళ్ల ఎన్ఆర్ఐ ఫరూఖ్ షేక్ నుంచి ఆమె లక్షల్లో డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వృద్ధుడు భారత్, యూకే మధ్య తిరుగుతూ పాపను తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని విచారణలో తేలింది. దీనిపై యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) స్పందించి చిన్నారిని రక్షించి, తల్లి, వృద్ధుడిని అరెస్ట్ చేసింది. నిందితులపై పోక్సో, మానవ అక్రమ రవాణా తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.




