అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రూరల్ మండలంలో జరుగుతున్న జనగణన సర్వేలో తూర్పుకాపులందరూ తప్పనిసరిగా తమను తూర్పుకాపులుగా నమోదు చేసుకోవాలని మండల అధ్యక్షుడు శెన్నంశెట్టి రామునాయుడు కోరారు. విద్యార్థులకు సులభ పద్ధతిలో తూర్పుకాపు బీసీ-డీ సర్టిఫికెట్లు జారీ చేయాలని తహసిల్దార్ ను అభ్యర్థించారు. ఈ ప్రక్రియలో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.