ముంచంగిపుట్టు మండలం కించాయిపుట్టు పంచాయతీలో టీడీపీ అధ్యక్షురాలు కిల్లో సన్యాసమ్మ సంధ్య రైతులతో ముఖాముఖి అయ్యారు. వ్యవసాయం లాభసాటిగా మారాలని, రైతు రాజు కావాలని, కూటమి ప్రభుత్వం రైతులకు పంచ సూత్రాలు, 5 విధానాలతో అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపారు. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించాలని, 90% సబ్సిడీపై విత్తనాలు అందిస్తామని, MSP, MIS ద్వారా పంట కొనుగోలు చేస్తామని, డిమాండ్ ఉన్న పంటలు వేసి రైతులు లాభపడాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీ కిముడు ఊరదోబ్, పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.