రేపు ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్

30చూసినవారు
రేపు ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్
AP: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం 582 జెడ్పీటీసీ, 7,778 ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ నెల 7న ఓట్ల లెక్కింపు చేపడతారు. 31,472 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 1,841 అత్యంత సమస్యాత్మక, 2,645 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి పటిష్ఠ భద్రత కల్పించారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్