దిగ్గజ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు 61వ చిత్రంతో రీ-ఎంట్రీ

2263చూసినవారు
దిగ్గజ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు 61వ చిత్రంతో రీ-ఎంట్రీ
తెలుగు సినిమా దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన 61వ చిత్రంతో ( #SSR61 ) మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి 'కల్కి 2898 AD' దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రొడక్షన్, క్రియేటివ్ సపోర్ట్ అందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమా, సింగీతం శ్రీనివాసరావు కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని మేకర్స్ తెలిపారు. త్వరలోనే టైటిల్ ప్రకటన వెలువడనుంది.