పుణె జిల్లాలోని ఖేడ్ తాలూకా రాజ్‌గురునగర్‌లో భారీ వర్షాల కారణంగా ప్రమాదం తప్పింది. సిద్ధివినాయక్ కమర్షియల్ కాంప్లెక్స్‌కు చెందిన భారీ రక్షణ గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన భీకర దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గోడ కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.