అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‍ల మధ్య యుద్ధాన్ని అనాలోచితమని, ట్రంప్ ఏమీ మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశం శాంతియుతంగా ఉండాలని, ఇరాన్, ఇజ్రాయెల్‍లతో భారతదేశం స్నేహంగా ఉందని తెలిపారు. ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియాలో భాగంగా నవ్ భారత్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్‍తో ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా యువత ఫిట్‍గా ఉండాలని కోరారు.