యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన విమాన ఇంధన ధరలు

33887చూసినవారు
యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన విమాన ఇంధన ధరలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశంలో విమాన ఇంధన (ATF) ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో కిలోలీటరుకు రూ.96,638గా ఉన్న ధర ఇప్పుడు రూ.2.07 లక్షలకు చేరుకుంది. ఇంధన ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం ఇదే తొలిసారి. ఈ పరిణామం విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీంతో ఆయా సంస్థలు టికెట్ ధరలు పెంచితే ప్రయాణికులపై భారం పడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్