AP: పార్వతీపురం మన్యం జిల్లాలో వార్డెన్ హేమని మానవత్వం చాటుకున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న 7వ తరగతి విద్యార్థిని భువనేశ్వరిని, రవాణా సౌకర్యం లేని గ్రామం నుండి రాళ్ల దారిలో 6 కిలోమీటర్లు భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె సకాలంలో స్పందించి విద్యార్థిని ప్రాణాలను కాపాడారు.