ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఆదివారం బట్టలు ఉతికితే భారీ జరిమానా, కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడొచ్చని తెలుస్తోంది. స్విట్జర్లాండ్‌లో ఆదివారం బట్టలు ఉతకడం, ఆరవేయడం చట్టవిరుద్ధం. నిబంధనల ప్రకారం ఆదివారాన్ని అధికారిక రెస్ట్ డేగా పరిగణిస్తారు. ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలిగించే శబ్దాలు చేసే పనులు చేయకూడదు. ఉమ్మడి లాండ్రీ రూమ్‌లు వాడటం నిషేధం. ఉల్లంఘిస్తే జరిమానా, కట్టకపోతే జైలు శిక్ష పడుతుంది. జర్మనీలో కూడా ఇదే రూల్ అమలులో ఉంది. అక్కడ ఆదివారం వాషింగ్ మెషీన్ వేస్తే 50 యూరోల నుండి 2500 యూరోల వరకు జరిమానా విధిస్తారు.