ఉపాధి పనుల్లో కూలీలకు ‘వాటర్ బెల్’ విధానం

36చూసినవారు
ఉపాధి పనుల్లో కూలీలకు ‘వాటర్ బెల్’ విధానం
AP: ఎండల తీవ్రత దృష్ట్యా, ఉపాధి హామీ పనుల్లో 'వాటర్ బెల్' విధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రతి గంటకు శ్రామికులకు తాగునీరు అందించడం, హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ నివారణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6-11, సాయంత్రం 4-6 గంటల మధ్య పనులు జరుగుతాయి, మధ్యాహ్నం 11-4 వరకు పనులు నిలిపివేస్తారు. పని ప్రదేశాల్లో షెడ్లు, చల్లని నీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించడంతో పాటు, శ్రామికుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్స్ ఈ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలి.

సంబంధిత పోస్ట్