ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు వేగవంతం చేస్తూ నూతన ప్రణాళికలు సిద్ధం చేశారు. అమరావతి ప్రణాళికలో అంతర్జాతీయ విమానాశ్రయం, బుల్లెట్ రైలు, ఏఐ (AI) సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేర్చారు. 600 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు, 4-లైన్ల రైల్వే ట్రాక్, ఎక్స్‌ప్రెస్ హైవేలు, కృష్ణా నదిపై కొత్త వంతెనల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అమరావతిని సింగపూర్ తరహాలో ప్రపంచమే తలతిప్పి చూసే నిరంతర అభివృద్ధి ఐకాన్‌గా తీర్చిదిద్దుతామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.