AP: రాష్ట్రంలో మౌళిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ముఖ్యంగా లాజిస్టిక్స్‌కు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గతంలో అధ్వాన్నంగా ఉన్న రాష్ట్ర రోడ్లను తమ అధికారంలోకి వచ్చాక బాగు చేయించి, గుంతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఆయన పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణం ఎంత ముఖ్యమో, వాటిని నిత్యం పర్యవేక్షించడం కూడా అంతే ముఖ్యమని సీఎం నొక్కి చెప్పారు.