అమరావతి చట్టబద్ధత బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదని, అయితే ఈ తరహా బిల్లుకు మాత్రమే తాము వ్యతిరేకమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. బిల్లులో అమరావతి ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తారో, ఎప్పటిలోగా రాజధాని నిర్మాణం పూర్తిచేస్తారో స్పష్టత లేదని ఆయన అన్నారు. అమరావతి రైతుల ప్రయోజనాలను పట్టించుకోవాలని, ఈ బిల్లు ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన సూచించారు.