AP: రాష్ట్ర విభజన వల్ల కొంత నష్టపోతే, గత ప్రభుత్వం వల్ల పూర్తిగా నష్టపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంస పాలన వల్ల వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని తిరుపతి బహిరంగ సభలో తెలిపారు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా తనను 53 రోజులు జైల్లో ఉంచారని, పవన్ కల్యాణ్‌ను అడుగడుగునా అడ్డుకొని వేధించారని ఆయన ఆరోపించారు. చీకటి పాలనకు చరమగీతం పాడాలనే కూటమిగా ఏర్పడ్డామని, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనాలు ఇవాళ చూస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.