AP: వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు, అన్నమయ్య జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ రెండు స్థానాల్లో పోటీలో ఉన్న
వైసీపీ అభ్యర్థులు తాము ఎన్నికల బరి నుంచి వైదొలగుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. అయితే, అభ్యర్థులు ఏ కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారనేది స్పష్టత లేదు.