AP: మొంథా తుఫాన్ వల్ల ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం మొంథా తుఫాన్‌లో ఉత్తమ సేవలందించిన వారి కోసం సీఎం క్యాంపు కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. పలువురిని సైక్లోన్ మొంథా ఫైటర్లుగా గౌరవిస్తూ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. తుఫాన్‌పై సమాచారాన్ని ముందుగానే ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించామని సీఎం చంద్రబాబు అన్నారు. వరద నీటిని తొలగించే పనులు వేగంగా జరిగాయన్నారు.