డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం ఉప్పాడ మత్య్సకారుల కుటుంబాలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పాడలో 7,193 మత్స్యకారుల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, వేట నిషేధ సమయంలో వారికి ఏటా రూ.20 వేలు అందిస్తున్నట్లు పపవన్ కళ్యాణ్ తెలిపారు. పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్యసంపద తగ్గుతోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.