ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి
అమెరికా ఆర్థిక సహాయం అవసరం లేదని వెల్లడించారు. ఆ సాయం సంక్షేమంలా మారిందని, అది తమకు వద్దని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ తక్కువేమీ కాదని,
అమెరికా సాయం తమ జీడీపీలో స్వల్పమని అన్నారు. దశలవారీగా US సాయాన్ని నిలిపేస్తామని తెలిపారు. మరోవైపు అవసరమైతే మూడోసారి కూడా ఇరాన్, లెబనాన్‌పై దాడులకు సిద్ధమని నెతన్యాహూ హెచ్చరించారు.