AP: ఆర్థికంగా ఎదిగి మరికొంతమందిని ఆదుకునే స్థాయికి బంగారు కుటుంబాలు రావాలని, పీ4 కార్యక్రమంతో జీరో పావర్టీ సాధించేలా కార్యాచరణ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ వ్యాప్తంగా 12 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించామని, 1.10 లక్షల మంది మార్గదర్శకులు ఆదుకోవడానికి ముందుకొచ్చారని తెలిపారు. ఈ సమావేశానికి బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మెగా,
అదానీ, టీవీఎస్ మోటార్ సైకిల్స్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.