AP: అమరావతి ప్రాంతంలో
వైసీపీ నేతలపై దాడులు చేసి, తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడం రాష్ట్రంలో 'జంగిల్ రాజ్' పాలనకు నిదర్శనమని
వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. అమరావతిలో తమ పర్యటనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. తాము మళ్లీ అమరావతి ప్రాంతానికి వస్తామని, ఎన్నిసార్లు అడ్డుకుంటారో చూస్తామని ఆయన సవాల్ విసిరారు.